1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 5 మే 2016 (16:57 IST)

తిరుపతిలోని మాధవంలో శ్రీవారి భక్తుల కోసం లిఫ్టు ప్రారంభం

తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్టును తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్‌ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. ముందుగా పూజ కార్యక్రమం నిర్వహించారు. 
 
మాధవం విశ్రాంతి గృహంలో ప్రస్తుతం రెండు లిఫ్టులు ఉన్నాయి. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 9 లక్షల వ్యయంతో మరో లిఫ్టును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.