శనివారం, 1 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: గురువారం, 9 జూన్ 2016 (13:35 IST)

శ్రీవారి సేవలో నారో రోహిత్... శ్రీవారి ఆదాయం రూ.3.03 కోట్లు

తిరుమలలో మోస్తరు రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. గదులతో పాటు తలనీలాల వద్ద భక్తుల ర

తిరుమలలో మోస్తరు రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటల సమయం పడుతోంది. గదులతో పాటు తలనీలాల వద్ద భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తోంది. నిన్న శ్రీవారిని 77,906 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 3లక్షల రూపాయలు లభించింది.
 
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ హెచ్‌.ఎల్‌.దత్తుతో పాటు సీనీ నటుడు నారా రోహిత్‌లు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.