సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 4 మార్చి 2017 (22:03 IST)

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే 8కోట్ల రూపాయల పాత పెద్దనోట్లు తితిదే ఖజానాలో మూలుగుతుంటే ఇంకా పాత నోట్లు వస్తుండడంపై ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు ఈఓ. భక్తుల మనోభావాలను దెబ్బతినే ప్రకటన చేస్త

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే 8కోట్ల రూపాయల పాత పెద్దనోట్లు తితిదే ఖజానాలో మూలుగుతుంటే ఇంకా పాత నోట్లు వస్తుండడంపై ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డారు ఈఓ. భక్తుల మనోభావాలను దెబ్బతినే ప్రకటన చేస్తే ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈఓ ఇన్ని రోజుల వరకు పాత పెద్ద నోట్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే తాజాగా ఒక ప్రకటన చేశారు ఈఓ. దయచేసి పాత పెద్ద నోట్లు (చెల్లని నోట్లు) వేయొద్దంటూ భక్తులను కోరారాయన. నిన్న హుండీలో కూడా పాత పెద్దనోట్లు రావడంపై తీవ్రంగా స్పందించారు ఈఓ. 
 
పాత పెద్దనోట్లు రద్దయిపోయాయని, అవి ఇక చెల్లని నోట్లని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఈఓ ఈ విషయాన్ని మీడియా ప్రజలకు తీసుకెళ్ళాలని కోరారు. పాత పెద్దనోట్లను అసలు వేయొద్దని కోరారు. ఇప్పటికైనా తితిదే ఈఓ సాంబశివరావు పాత పెద్దనోట్లపై స్పందించడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు తిరుపతిలోని ఖజానాలో మూలుగుతున్న 8కోట్ల రూపాయల పాత పెద్దనోట్లను మార్చలేక అలానే పడేసింది తితిదే. ఇప్పటికై తితిదే ఈఓ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు లేఖ కూడా రాసింది. అయితే ఇప్పటి వరకు ఆ లేఖకు ఆర్ బిఐ స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక అలాగే వదిలేశారు.