Daily Horoscope
✕

గ్రహణ గండాలకు అతీతం : కాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు

సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో చిన్నపాటి ఆలయాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి గ్రహణం వీడిపోయేంత వరకు అన్ని రకాల పూజలు నిలిపివేయడమే కాకుండా ఆలయాల

Written By pnr
Updated: శుక్రవారం, 27 జులై 2018 (12:13 IST)
సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో చిన్నపాటి ఆలయాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి గ్రహణం వీడిపోయేంత వరకు అన్ని రకాల పూజలు నిలిపివేయడమే కాకుండా ఆలయాలను కూడా మూసివేస్తుంటారు.
 
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం దీనికి అతీతం. ఇక్కడ గ్రహణ గండాలకు అతీతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ఆలయాల తలపులు మూసివేయనున్నారు. 
 
కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచనున్నారు. దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తీలో ఎప్పుడు గ్రహణం పట్టినా…. ఆలయాన్ని తెరిచే ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేకంగా గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. 
 
రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముక్కంటికి గ్రహణ కాల అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి ఒంటి గంటకు సంకల్ప పూజలు ప్రారంభించి ఉదయం 3 గంటల్లోపు అభిషేకాలు పూర్తి చేసేలా వేదపండితులు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో భక్తులను కూడా అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

చెక్ బౌన్స్ కేసు : నిర్మాత బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష కేసు సుఖాంతం! పిటిషనర్ వీడియో

ప్రయాణికులకు అలెర్ట్ : వందే భారత్ రైలు ఎక్కే ముందు ఇవి తెలుసుకోండి...

ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?

తిరుమల చరిత్రలోనే తొలిసారి... విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం

రెండు దశాబ్దాలు పనిచేస్తే చెప్పాపెట్టకుండా తీసేసారు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆవేదన

అన్నీ చూడండి

24-11-2026 మంగళవారం దిన ఫలాలు - అనవసర ఖర్చులను నియంత్రించాలి

కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం ఎందుకు వెలిగించాలి?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

23-11-2026 సోమవారం దిన ఫలాలు - పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు...

22-11-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో...?

తర్వాతి కథనం
Show comments