తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

శుక్రవారం, 13 మే 2016 (12:38 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఒకటిన్నర కిలోమీటర్‌కు పైగా సర్వదర్శనం క్యూలైన్‌ బయటకు వచ్చేసింది. ఎండలోనే భక్తులు స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. 
 
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఇదే పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. కాలినడక భక్తులు 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 7 గంటలకుపైగా సమయం పడుతోంది. గదులు ఖాళీలు లేవు. గదుల కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన పరిస్థితి. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. గురువారం శ్రీవారిని 71,995 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.22 కోట్ల మేరకు వసూలైంది. 

అన్నీ చూడండి

ఆప్ మాజీ అభ్యర్థి అనుమానాస్పద మృతి - ప్రియుడే చంపేశాడా?

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బిర్యానీలో ఈగ - రూ.లక్ష జరినామా

వెనెజువెలాలో భారీ భూకంపం.. లక్ష మంది మృతి? (Video)

సట్లెజ్ నదిపై గ్రావెల్ ట్రక్కు వెళుతుండగా కూలిన ట్రక్కు (వీడియో)

తిరుపతి జిల్లాలో నలుగురి ప్రాణాలు తీసిన విజిల్.. ఎలా?

అన్నీ చూడండి

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments