ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (13:25 IST)

కొండ మార్గంలో రాత్రిపూట టూవీలర్లకు అనుమతి లేదు.. టీటీడీ

Tirumala Ghat Road
తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండ మార్గంలో ద్విచక్ర వాహనాలు రాత్రిపూట వెళ్లనిచ్చేది లేదని టీటీడీ తెలిపింది. ఇకపై తిరుమల కొండ మార్గం ద్వారా టూవీలర్లు వెళ్లేందుకు నిషేధం విధించినట్లు టీటీడీ వెల్లడించింది. 
 
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టూవీలర్లను కొండమార్గంలో ప్రయాణించేందుకు అనుమతించరు. వన్య మృగాలు ఘాట్ రోడ్డులో సంచరించడంతో టూవీలర్ వాహనదారులను ఆ మార్గంలో ప్రయాణించడం సబబు కాదని టీటీడీ తెలిపింది.

తిరుమలకు యాత్రికులు ఎలాంటి మాంసాహార పదార్థాలు, మసాలాలు తీసుకురాకూడదు
మద్య పానీయాలు తీసుకురావడం ఖచ్చితంగా అనుమతించబడదు
మద్యం సేవించిన వారిని తిరుమల, ఘాట్‌రోడ్డుకు అనుమతించరు.
తిరుమలకు అగ్నిమాపక పదార్థాలు, మండే పదార్థాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడింది.