గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (16:38 IST)

ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?

garuda seva in tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతుంది. అయితే ఆగస్టు నెలలో తిరుమలలో రెండు గరుడ సేవలు జరుగనున్నాయి. ఈ గరుడ సేవలను నవ దంపతులు కనులారా వీక్షిస్తే.. సుఖమయ, అన్యోన్య జీవితం చేకూరుతుందని విశ్వాసం. 
 
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమిని పురస్కరించుకుని గరుడ సేవ సాగనుంది. అలాగే ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని మలయప్ప వాహనంలో తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. 
 
ఆగస్టు 9వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ గరుడ సేవ జరుగనుంది. అలాగే ఆగస్టు 19వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు ఈ గరుడ సేవ జరుగనుంది. 
 
ఆగస్టు నెలలో ఇలా రెండు గరుడ సేవలు జరుగనుండటంతో నవదంపతులు స్వామిని దర్శించుకుంటే వారి వైవాహిక జీవితం సుఖమయంగా వుంటుందని.. సత్ సంతానం కలుగుతుందని విశ్వాసం. కాగా తిరుమల శ్రీవారిని ఆదివారం 75,356 మంది భక్తులు దర్శించుకున్నారు.