తిరుమల కొండపై మూడో ఘాట్ రోడ్డు ఎక్కడ..? చంద్రగిరి, రేణిగుంట వైపు నుంచి..?

Written By Selvi
Updated: సోమవారం, 7 డిశెంబరు 2015 (17:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండపైకి చేరుకునేందుకు ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్డు మార్గాలున్న సంగతి తెలిసిందే. మొదటి ఘాట్ రోడ్డును కొండపై నుంచి కిందకు వచ్చేందుకు, రెండో ఘాట్ రోడ్డును కింద నుంచి పైకి ఎక్కేందుకు వాడుతుండగా.. రెండు రోడ్లకూ మధ్య ఓ లింక్ రోడ్డు కూడా ఉంది.

కాలినడకన తిరుమల చేరే భక్తుల కోసం, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డును నిర్మించాలని తితిదే నిర్ణయించింది. 
 
అయితే ఈ మూడో ఘాట్ రోడ్డు ఏవైపు ఉండాలని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. గతంలో కూడా మూడో మార్గం నిర్మించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. శ్రీవారి మెట్టు మార్గానికి అవతలి నుంచి.. అంటే చంద్రగిరి కొండలవైపు నుంచి రహదారికి అనుకూలమని తేల్చారు. అంతేగాకుండా రేణిగుంట వైపు నుంచి మరో రహదారిని నిర్మించవచ్చునని సూచించారు.

అన్నీ చూడండి

రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి

సస్పెండ్ చేశారనీ రైలుకింద పడి తాహసీల్దారు ఆత్మహత్య

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

అన్నీ చూడండి

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

Show comments