ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:31 IST)

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. ట్రాఫిక్‌కు అంతరాయం

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీత వర్షాల కారణంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండచరియలు, చెట్లు విరిగిపడ్డ

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీత వర్షాల కారణంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. అక్కగార్ల గుడి సమీపంలో బండ రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. 
 
ఆ సమయంలో వాహనాలు, కాలి నడకన వచ్చే భక్తులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బండరాళ్లు, చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమచారం తెలుసుకున్న టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది… వాటిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.