Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 26 నవంబరు 2024 (09:37 IST)
వచ్చే యేడాది జనవరి నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలపై తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం తితిదే అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. 
 
అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్, ఎస్ఆర్ఎ దర్శనాలతో పాటు అర్జితసేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామని పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

మేకలు కాస్తున్న బాలుడు... వీడియో వైరల్.. స్పందించిన నారా లోకేష్ (video)

భర్తను హత్య చేసిన శవాన్ని డ్రమ్‌లో పెట్టిన కేసు : దోషులుగా భార్య, ప్రేమికుడు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసు.. రన్యా రావుకు రూ.89 కోట్ల జరిమానా

అసాధారణ సాహసి పైలెట్ కెప్టెన్ స్మిత్ మచార్‌కు 'విశిష్ట గుజరాత్ కరీమా పురస్కార్'

అరకును ప్రపంచ కాఫీ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. చంద్రబాబు

అన్నీ చూడండి

శుక్రవారంతో ఆరుద్ర నక్షత్రం.. ఏ పూజ చేయాలి.. ఎలాంటి దానం ఇవ్వాలంటే?

శబరిమల ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల తయారీకి హలాల్ బెల్లం వాడారా?

01-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - ఇంట్లో సంతోషకరమైన వాతావరణం

Sukha Maharishi: శుక మహర్షి ఎవరు? గురువారం పూజిస్తే?

01-10-2026 నుంచి 31-10-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం

తర్వాతి కథనం
Show comments