లడ్డూ రేట్లను పెంచం - విఐపి బ్రేక్‌ టికెట్ల రేట్లు తప్పదు... తెలంగాణ రూ.5 కోట్లు ఇస్తోంది... టిటిడి ఛైర్మన్‌

శుక్రవారం, 18 మార్చి 2016 (16:45 IST)
తిరుమల లడ్డూ రేట్లను ఇప్పట్లో పెంచబోమన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి.  సామాన్య భక్తుల కోసం ప్రవేశపెట్టిన 300 రూపాయల శీఘ్ర దర్శన టోకన్ల రేట్లను పెంచకుండా విఐపి బ్రేక్‌ దర్శన టికెట్ల రేట్లను మాత్రం పెంచతామన్నారు చదలవాడ. గతంలో టిటిడి సబ్‌కమిటీ సూచనలు చేసిన విధంగా ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచాలని అనుకున్నా సభ్యులందరు ఆమోదించకపోవడంతో వెనక్కి తగ్గింది టిటిడి పాలకమండలి.
 
కేవలం విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్ల రేట్లను మాత్రమే పెంచుతామన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలికి బంగారు పూతరేకుల కోసం దాతల విరాళాల కోసం ఎదురుచూస్తున్నామని, దాతలు ముందుకు రాకుంటే టిటిడినే ఆ పనులను పూర్తి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి 5 కోట్ల రూపాయల విలువైన సాలిగ్రామం, బంగారు చైన్లను త్వరలో ఇవ్వనుందని తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వెంకటగిరి రాజా నిర్మించిన క్రిష్ణుని ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకున్నామని చెప్పారు.
 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమైందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి చెందిన 2.74 ఎకరాల స్థలాన్ని దక్షిణమధ్య రైల్వేకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 3.5 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. అప్పలాయగుంటలో అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేక సేవలను తీసుకువస్తున్నట్లు చెప్పారు చదలవాడ.

అన్నీ చూడండి

జూలై 15, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

అన్నీ చూడండి

15-07-2026 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి...

ఆషాఢ గుప్త నవరాత్రి ప్రారంభం.. వారాహి దేవిని పూజిస్తే...?

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు.. జూలై 16న చారిత్రక గోల్కొండ కోటపై..?

14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం

జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?

Show comments