తితిదే పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి ప్రమాణస్వీకారం
తితిదే పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆయన పాలకమండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. గతంలో పాలకమండలి సభ్యుడిగా పనిచేసిన సాయన్న స్థానంలో నరసారెడ్డి కొనసాగనున్నారు. సాయన్నను తితిదే పాలకమండలి సభ్యుడిగా నియమించినా ఆయన సమావేశానికి రాకపోవడంతో పాటు పార్టీ మారడంతో ఆయన్ను ఆయన పదవి నుంచి దేవదాయశాఖ తొలగించింది.
ప్రస్తుతం నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన తెలంగాణ వ్యక్తి నరసారెడ్డికి ఆ పదవి లభించింది. మరో సంవత్సరం పాటు నరసారెడ్డి తితిదే పాలకమండలి సభ్యులుగా కొనసాగనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి తితిదే పాలకమండలి ఇవ్వాలన్న ఆలోచనతోనే నరసారెడ్డికి ఈ పదవికి అప్పగించారు చంద్రబాబు. ఇదిలా ఉంటే ఈనెల 14వతేదీ పాలకమండలి సమావేశం జరుగనుంది.