తితిదే పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ ఉత్తర్వులు... ప్రమాణ స్వీకారం లేకుండానే...

Written By ttdj
Updated: మంగళవారం, 3 మే 2016 (05:59 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్నను తొలగిస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జి.ఓ.నెంబర్‌ 187ను దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ విడుదల చేశారు. 
 
టిటిడి పాలకమండలి సమావేశం జరిగే సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు సాయన్న. అంతేకాకుండా నాలుగుసార్లు జరిగిన పాలకమండలి సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో పాలకమండలి నుంచి సాయన్నను తొలగిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు.
 
మరోవైపు... తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా మరో యేడాది పాటు చదలవాడ క్రిష్ణమూర్తిని నియమిస్తూ సంతకం చేసిన జిఓ పత్రాలు చదలవాడ కృష్ణమూర్తికి చేరాయి.. గతనాలుగు రోజులకు ముందే ముఖ్యమంత్రి టిటిడి పాలకమండలిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ పాలకమండలిని కొనసాగిస్తూ జి.ఓ.నెంబర్‌ 188ని విడుదల చేశారు. 
 
ఈ జిఓ నెంబర్‌ ప్రకారం 15మంది పాలకమండలి సభ్యులతో పాటు టిటిడి ఛైర్మన్‌ అదే పదవిలో కొనసాగనున్నారు. అయితే దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన జిఓ సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు ఛైర్మన్‌‌తో పాటు సభ్యుల చేతికి చేరింది. జిఓ ప్రకారం సభ్యులెవరు తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేకుండానే, పాలకమండలి సభ్యులుగా కొనసాగనున్నారు.

అన్నీ చూడండి

జూలై 29, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం... తెలంగాణలో చల్లచల్లగా.. ఏపీలో ఉక్కపోత

భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

అన్నీ చూడండి

29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)

Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..

గురు పౌర్ణమి.. వ్యాస‌ పూర్ణిమ.. శ్రీహరి అంశ.. కృష్ణ ద్వైపాయనుడిని పూజిస్తే?

28-07-2026 మంగళవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments