Daily Horoscope
✕

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్‌

Written By సెల్వి
Updated: మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (21:30 IST)
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షం కానుంది. 
 
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
టీటీడీ వసతి సముదాయాలు, గెస్ట్ హౌసులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలన్నీ మొబైల్ ఫోన్‌లో కనిపిస్తాయి. తద్వారా కొండపై ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సులువు అవుతుందని టీటీడీ పేర్కొంది. 

అన్నీ చూడండి

హువాంగ్‌ను నియమించుకోవడం ఒక గౌరవంగా ఉంటుంది.. ఎలాన్ మస్క్

హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్య.. ఏం జరిగింది..?

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబును విమర్శించిన వైకాపా చీఫ్ జగన్

Nvidia సీఈఓ జెన్సెన్ హువాంగ్ వివాహేతర సంబంధం... రూ.26 లక్షల కోట్ల నష్టం

రాప్తాడు నిందితుడికి పల్మనరీ ఎంబాలిజం సమస్య... ప్రాణాపాయ పరిస్థితులు.. వైద్యులు

అన్నీ చూడండి

12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?

Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?

10-11-2026 మంగళవారం ఫలితాలు - సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి...

తర్వాతి కథనం
Show comments