తిరుమల కొండపై నటి అర్చన గౌతమ్ నానా రచ్చ... టీటీడీ వివరణ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీ శివకాంత్ తివారి, నటి అర్చనా గౌతమ్‌తో పాటు మరో ఏడుగురికి ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
యూపీ చెందిన నటి అర్చన గౌతమ్ తిరుమల కొండపై నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దర్శనం కోసం పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న కూడా టీటీడీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించింది. కౌంటర్‌కి వెళ్లి అడగ్గా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
అయితే తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తూ ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు.