Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:54 IST)
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. 
 
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు. 
 
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

అన్నీ చూడండి

ప్రియుడితో భార్య రాసలీలలు - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బెడ్రూంలోనే పెళ్లి జరిపించిన భర్త.. ఎక్కడ? (Video)

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?

అయ్యా.. నా భార్య ఆసుపత్రిలో వుంది, బైక్‌ను వదిలేయండి: పోలీసులను వేడుకున్న డెలివరీ రైడర్, వీడియో

Tirumala: అలిపిరి ఘాట్ రోడ్డు వద్ద దొరికిన బ్యాగ్.. అందులో ఏముందంటే?

అన్నీ చూడండి

30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు

29-08-2026 శనివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు.. ఖర్చులు విపరీతం...

28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?

రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే

తర్వాతి కథనం
Show comments