మంగళవారం, 14 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (18:52 IST)

Makar Sankranti 2025: సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే..?

sankranti
sankranti
సంక్రాంతి రోజున శుచిగా స్నానమాచరించి పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించి, నువ్వులను తీసుకుని ప్రవహించే నీటి ప్రవాహంలో తేలే విధంగా వేయాలి. సరైన ఆచారాలతో సూర్య భగవానుడిని పూజించండి. పూజ సమయంలో సూర్య చాలీసా పఠించాలి. చివరగా హారతి చేయడం ద్వారా పూజను ముగించాలి. పూజ తర్వాత అన్నదానం చేయండి. 
 
మకర సంక్రాంతి రోజున పూర్వీకులకు నైవేద్యాలు, పిండదానం కూడా చేస్తారు. జనవరి 14, 2025న మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 09.03 గంటల నుంచి సాయంత్రం 05.46 గంటల వరకు శుభముహూర్తం. 
 
ఈ కాలంలో స్నానం, ధ్యానం, పూజలు, జపం, తపస్సు, దాన ధర్మాలు చేయవచ్చు. ఈ కాలంలో పూజలు, దానం చేయడం వల్ల సూర్యభగవానుడి విశేష ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా నువ్వులు, చిర్వా, ఉన్ని బట్టలు, దుప్పట్లు మొదలైన వాటిని దానం చేయడం కూడా మంచిది.