బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (10:59 IST)

దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు.. లాభాలతో పరుగులు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ నిర్ణయంతో భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. 
 
సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 51 వేలను సెన్సెక్స్ దాటింది. 600 పాయింట్ల లాభంతో 51,314 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. 180 పాయింట్ల లాభంతో 15,104 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. బడ్జెట్ జోరుతో గతవారమంతా సూచీలు లాభాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
దశాబ్దకాలంలోనే అత్యుత్తమ వారం వారీ లాభాలు గత వారంలో నమోదు చేసిన దేశీ స్టాక్ సూచీలు తాజావారం తొలి సెషన్‌లోనూ అదే దూకుడు చూపుతున్నాయి. ఆర్థిక రికవరీపై పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలకు తోడు గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.