మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:12 IST)

చరిత్రలో తొలిసారి 51వేల మార్కు-స్టాక్ మార్కెట్ పరుగో పరుగు

BSE
దేశీయ స్టాక్ మార్కెట్‌ లాభాలతో పరుగు పెడుతోంది. బడ్జెట్‌ బూస్ట్‌కు తోడు,అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల సపోర్ట్‌తో దేశీయ మార్కెట్‌ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 51వేల మార్కును అధిగమించింది. అటు నిఫ్టీ 15 వేల మార్కును క్రాస్‌ చేసింది. 450 పాయింట్లు పెరిగి సెన్సెక్స్ తొలిసారిగా 51,031, నిఫ్టీ 15,004ని టచ్‌ చేసింది.
 
ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకిగ్‌  షేర్లు ర్యాలీ అవుతున్నాయి. ఫలితంగా  బ్యాంక్‌ నిఫ్టీ కూడా 36వేల మార్కును అధిగమించింది. సెన్సెక్స్‌  ప్రస్తుతం 356 పాయింట్ల లాభంతో 50986 వద్ద, నిఫ్టీ 94  పాయింట్ల లాభంతో 14990 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.