శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (10:54 IST)

శ్రీకృష్ణాష్టమి... జీవితకాల గరిష్ఠ స్థాయికి సూచీలు

భారత స్టాక్ మార్కెట్లు శ్రీకృష్ణాష్టమి రోజున పుంజుకున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు లాభపడి 56,505 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 16,823 వద్ద కొనసాగుతున్నాయి. 
 
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. అమెరికా సూచీలు గతవారాన్ని లాభాలతో ముగించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణిస్తుండడం విశేషం. బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.