గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (09:53 IST)

శుక్రవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్.. కారణం అదే?

బాంబే స్టాక్‌ మార్కెట్‌ వారాంతపు చివరి రోజైన శుక్రవారం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 110 పాయింట్లు పెరిగి 34318 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10134.60 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిప్తోంది.  ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు అత్యధికంగా లాభపడుతున్నాయి.  
 
భారత్‌ - చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో నేడు భారత ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. కరోనా వైరస్‌ సంబంధిత వార్తలు, స్టాక్‌-ఆధారిత ట్రేడింగ్‌ మార్కెట్‌ మూమెంటంను నిర్దేశించే అవకాశం ఉంది. 
 
అలాగే పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌తో సుమారు 46 కంపెనీలు నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటికి తోడు నేడు స్టాక్‌ మార్కెట్‌కు వారాంతపు రోజు కావడంతో ఇన్వెసర్లు లాభాల స్వీకరణకు పూనుకొనే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో పుంజుకుంది.