శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (18:21 IST)

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే గ్రీన్ టీ.. కానీ మోతాదు మించితే?

అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గ్రీన్ టీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. అంతేకాకుండా గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఇత‌ర ఆహారాల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. 
 
గ్రీన్ టీ లో కాటెకిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీ ని తాగ‌డం అల‌వాటు చేసుకుంటే పొట్ట ఫ్లాట్ కావడం గ్యారంటీ అని చెప్తున్నారు న్యూట్రీషియన్లు. గ్రీన్ టీలో చ‌క్కెర కాకుండా తేనె క‌లుపుకుని తాగితే ఇంకా అద్భుత‌మైన లాభాలుంటాయి.
 
అయితే గ్రీన్ ఎంత ఆరోగ్య‌క‌రం అయినప్ప‌టికీ దాన్ని మోతాదుకు మించి సేవించ‌రాదు. గ్రీన్ టీ అధికంగా తాగితే డీహైడ్రేష‌న్‌, అసిడిటీ పెరుగుతాయి. క‌నుక గ్రీన్ టీని మోతాదులో తాగితే అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చునని న్యూట్రీషియన్లు సెలవిస్తున్నారు.