Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదరంగం గురించి మీకు తెలుసా? (video)

Written By ఎంజీ
Updated: గురువారం, 16 సెప్టెంబరు 2021 (19:27 IST)
చదరంగం ఆటే..ఒకరకము ఆట .. మరి ఇది ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? .. కొన్ని శతాబ్దాల క్రితం.. మన దేశంలో బలహైతు అనే ఓ రాజు ఉండేవాడు. అతడోసారి తన ఆస్థానంలో తెలివైనవాడిగా పేరున్న సిస్సా అనే వ్యక్తిని పిలిపించాడు. 
 
'ఈనాటి ఆటలన్నీ బలం మీదనో, అదృష్టం మీదనో ఆధారపడి ఉన్నాయి. అలాకాకుండా తెలివితో ఆడే, తెలివిని పెంచే ఆటని రూపొందించగలరా?' అని అడిగాడు. సరేనన్న సిస్సా 64 గడులపై భట, సైనిక, హయ, గజ బలాలతో సాగే ఆటను రూపొందించి, 'చతురంగ' అని పేరు పెట్టాడు.
 
ఆ ఆటను చూసి మురిసిపోయిన రాజు 'ఇందుకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకోండి' అన్నాడు. దానికి సిస్సా ఏం అడిగాడో తెలుసా? ఆ ఆటని ఆడే పట్టికలో మొదట గడిలో ఒక ధాన్యం గింజని ఉంచి, తరువాత ప్రతి గడికీ వాటి సంఖ్యను రెట్టింపు చేస్తూ 64 గడులకీ ఎన్నవుతాయో అంత ధాన్యాన్ని ఇమ్మని కోరాడు.

మొదట ఆ కోరిక చాలా చిన్నదని భావించిన రాజు ఆ తర్వాత దాన్ని తీర్చడం అసాధ్యమని గ్రహించాడు. ఎందుకో తెలుసా? అలా లెక్కించే ధాన్యం గింజల సంఖ్య 18,445,744,073,709,551,515 అని తేలుతుంది. ఇది ప్రపంచం మొత్తం మీద పండే ధాన్యం గింజల కన్నా ఎన్నో రెట్లు అధికం. అప్పుడు రాజు సిస్సాను ఘనంగా సత్కరించి ఆ ఆటను దేశదేశాల్లో ప్రచారం చేస్తాడు. చెస్‌ పుట్టుక వెనుక ప్రచారంలో ఉన్న కథ ఇది!
 
కథ పక్కన పెడితే చదరంగం పుట్టింది మన దేశంలోననే ఎక్కువ శాతం చరిత్రకారులు నమ్ముతారు. క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో దీన్ని ఆడినట్టు ఆధారాలున్నాయి. కొంతమంది మాత్రం చైనాలో పుట్టిందని చెబుతారు. అక్కడ రెండో శతాబ్దంలోనే చెస్‌ని పోలి ఉన్న క్సియాంగి అనే ఆటను ఆడేవారంటారు.
 
ఇప్పుడు మనం ఆడుతున్న ఆటకు 15వశతాబ్దంలో పూర్తి రూపం వచ్చింది. ఇది ఒక క్రీడగా గుర్తింపు పొందింది 19వ శతాబ్దంలో. ప్రపంచంలో తొలిసారిగా 1851లో చదరంగం పోటీలను లండన్‌లో నిర్వహించారు. అధికారికంగా ప్రపంచస్థాయి ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరిగింది మాత్రం 1886లో.
 

అన్నీ చూడండి

నీట్ యూచీ 2026 అడ్మిషన్స్.. 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

ప్రధాని మోడీ ఫోటోలు మార్ఫింగ్.. మెటా హెడ్‌పై కేసు నమోదు. డీసీపీపై టి సర్కారు చర్యలు

ఆ ఎన్నికను రద్దు చేసిన కర్నాటక హైకోర్టు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

45 నిమిషాల్లో 5 ప్లేట్ల మటన్ బిర్యానీ తినేశాడు.. జీవితాంతం ఉచిత బిర్యానీ ఆఫర్

August 2, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

తర్వాతి కథనం
Show comments