మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (08:52 IST)

12 యేళ్ళ బుడతడు వరల్డ్ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా...

12 యేళ్ళ బుడతడు ఒకడు వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ చిన్నారి పేరు అభిమన్యు మిశ్రా. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చెస్‌లో గ్రాండ్ మాస్టరుగా అవతరించాడు. 
 
12 సంవత్సరాల, 4 నెలల 25 రోజుల వయసున్న మిశ్రా, ఇప్పటివరకూ సెర్గీ కర్జాకిన్ పేరిట ఉన్న రికార్డును తుడిపేశాడు. మూడేళ్ల క్రితం కర్జాకిన్ 12 ఏళ్ల, 7 నెలల వయసులో గ్రాండ్ మాస్టరుగా అవతరించి, రికార్డును సృష్టించగా, ఇప్పుడది కనుమరుగైంది. 
 
అదేసమయంలో భారత్‌కు చెందిన ఆర్.ప్రజ్ఞానంద త్రుటిలో అభిమన్యును దాటి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించే అవకాశాన్ని కోల్పోయాడు. గత సంవత్సరం ఇంటర్నేషనల్ మాస్టర్‌గా అవతరించిన అభిమన్యు, ఆపై తాను పాల్గొన్న ప్రతి పోటీలోనూ సత్తా చాటుతూ వచ్చాడు. 
 
కాగా, గత యేడాది కరోనా వైరస్ కారణంగా అనే టోర్నమెంట్లు నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే, అభిమన్యు లక్ష్యాన్ని బుడాబెస్ట్ గ్రాండ్ మాస్టర్ పోటీలు నెరవేర్చాయి.