మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం

asian sports indian team
చైనాలోని హౌంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్‌కు తొలి బంగారు పతకం వరించింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టుకు ఈ గోల్డ్ మెడల్ లభించింది. ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వరీ తోమర్‌తో కూడిన జట్టు బంగారు పతకాన్ని వొడిసి పట్టుకుంది. గోల్డ్ మెడల్ సాధించడమేకాకుండా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సాధించిన పాయింట్స్ ద్వారా ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టింది. 
 
క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఏకంగా 1893.7 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో చైనా నెలకొల్పిన 1893.3పాయింట్ల రికార్డు బద్ధలైంది. అలాగే పురుషులు ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. జస్విందర్, భీమ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10:81 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.