గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (08:57 IST)

బ్లాక్‌బస్టర్ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్ : సింధుతో టైటిల్‌ పోరుకు సైనా

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వేడెక్కింది. ఒకే దేశానికి చెందిన ఒలింపిక్‌ పతక విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి టైటిల్‌ కోసం ముఖాముఖీగా తలపడ

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వేడెక్కింది. ఒకే దేశానికి చెందిన ఒలింపిక్‌ పతక విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి టైటిల్‌ కోసం ముఖాముఖీగా తలపడనున్నారు. 2007 తర్వాత సైనా… 2013 తర్వాత సింధు ఈ దేశవాళీ అత్యున్నత టోర్నీలో బరిలోకిదిగారు. 
 
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో సైనా (పీఎస్‌పీబీ) 21–11, 21–10తో అనురా (ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)పై గెలుపొందగా… సింధు (ఆంధ్రప్రదేశ్‌) 17–21, 21–15, 21–11తో రుత్విక శివాని (పీఎస్‌పీబీ)పై చమటోడ్చి విజయం సాధించింది.
 
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ (పీఎస్‌పీబీ), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (పీఎస్‌పీబీ) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్‌ 21–16, 21–18తో లక్ష్య‌సేన్‌ (ఉత్తరాఖండ్‌)పై, ప్రణయ్‌ 21–14, 21–17తో క్వాలిఫయర్‌ శుభాంకర్‌ డే (రైల్వేస్‌)పై గెలుపొందారు. 2013లో శ్రీకాంత్‌  జాతీయ చాంపియన్‌గా నిలువగా… ప్రణయ్‌ తొలిసారి ఈ టైటిల్‌ను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.