పారిస్ ఒలింపిక్స్ 2024- భారత్‌కు మను భాకర్ తొలి పతకం
పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటర్ మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఆమె కాంస్యం సాధించింది. హర్యానాకు చెందిన మను భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్, విజయ్‌కుమార్‌లు కాంస్యం సాధించినప్పుడు చివరిసారిగా భారతీయులు షూటింగ్ పతకాన్ని గెలుచుకున్నారు.
ఇకపోతే.. మను 221.7 స్కోరుతో కాంస్యం కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ యే ఓహ్ మొత్తం 243.2తో స్వర్ణం కైవసం చేసుకోగా, ఆమె స్వదేశానికి చెందిన కిమ్ యెజీ మొత్తం 241.3తో రజతం సాధించింది.