సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (08:33 IST)

ప్యారిస్ ఒలిపింక్స్ : నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషు ఆర్చరీ టీమ్

paris olympics
విశ్వక్రీడలు (ఒలింపిక్స్) శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యమిస్తుంది. అయితే, భారత పురుషుల టీమ్ అరుదైన ఘనత సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత అర్చర్లు ఆరంభంలోనే తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుని టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. 
 
అర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీవ్ రాయ్, ప్రవీణ్ జాదవ్ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సాధించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్.. భారత జట్టుని టాప్ - 4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 
 
కాగా, భారత జట్టు మూడో స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో తలపడే అవకాశం ఉంది. భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుని అక్కడ నుంచి దక్షిమ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.