శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (10:25 IST)

ప్రధాని మోదీతో ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెల్ఫీ

Modi-Zareen
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానితో కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

 
జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై ప్రధాని మోదీ ఆమెను అభినందించారు. జరీన్‌తో పాటు యువ బాక్సర్లు మనీష్ మౌన్, పర్వీన్ కూడా వున్నారు. వీరందరితో ప్రధానమంత్రి ముచ్చటించారు. 'ప్రధాని మోదీ జీ.. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.. థాంక్యూ సర్‌' అంటూ జరీన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.