తీయతీయని పిస్తా-జీడి పప్పు లడ్డూ ఎలా చేయాలో తెలుసా?

సోమవారం, 9 సెప్టెంబరు 2019 (21:10 IST)
చాలామంది తీపి పదార్థాలను స్వీట్ షాపుల్లో కొంటుంటారు. కానీ వాటిని ఇంట్లోనే తయారుచేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు తీయని లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బూందీ కోసం శెనగపిండి - 2 కప్పులు
రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
ఫుడ్ కలర్ - పావు టీ స్పూన్
నీళ్లు - ఒకటిన్నర కప్పు
నూనె - తగినంత
 
పంచదార పాకం కోసం
పంచదార- ఒక కప్పు
ఫుడ్ కలర్ - అర టీ స్పూన్
నీళ్లు - అరకప్పు
యాలకుల పొడి - పావు టీ స్పూన్
జీడిపప్పు - నాలుగైదు పలుకులు
పిస్తా - నాలుగైదు పలుకులు
 
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి పంచదార వేసి మరిగించి పానకం తయారుచేసుకోవాలి. అందులో యాలకుల పొడి, జీడిపప్పు, పిస్తా పప్పు, ఫుడ్ కలర్ వేసి పక్కన పెట్టుకోవాలి.
 
మరొక పాత్రలో నూనె పోసి వేడి చేయాలి. శెనగపిండిలో నీళ్లు పోసి కాస్త చిక్కగా వుండేలా చూసుకోవాలి. రంధ్రాలు వుండే జాలీ తీసుకుని శెనగపిండిన అందులో నుంచి నూనెలో వేయాలి. కాస్త వేగాక బూందీని నూనెలో నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు పంచదార పానకంలో బూందీ వేయాలి. కాసేపు ఆగితే పంచదార పానకం బూందీకి పట్టేస్తుంది. తర్వాత బూందీని అరచేతిలో కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా ఒత్తుకోవాలి. 

అన్నీ చూడండి

రౌడీ కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి దారుణ హత్య

రోజుకు 4 గంటలే పని చేస్తున్నా.. సగం జీతం మాత్రమే ఇవ్వండి : యోగి సర్కారుకు ఐఏఎస్ లేఖ

డీఎంకేకు విపక్షంలో ఉన్నా మద్దతిస్తా... ఆ పార్టీకి కట్టప్పను : సత్యరాజ్

వైజాగ్‌లో ముగ్గురు అన్నదమ్ముల మిస్సింగ్.. ఎక్కడకు వెళ్లివుంటారు?

ఇక తగ్గేదే లేదు.. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటాం : ఇరాన్ ప్రకటన

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments