మీ కుల్ఫీ మీ ఇష్టం... ఇలా తయారుచేస్తే సూపర్ టేస్టీ...  
                                       
                  
                  				  టేస్టీ కుల్ఫీ కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.
	 
	పాలు - లీటరు,
	పంచదార - అరకప్పు,
				  											
																													
									  
	కోవా - పావుకప్పు,
	యాలకుల పొడి - అరచెంచా, 
	తరిగిన బాదం, పిస్తా పలుకులు - కొన్ని,
	పాల మీగడ - అరకప్పు.
				  
	 
	తయారీ... 
	పొయ్యి వెలిగించి పాన్ పెట్టి పాలు వేడి చేసుకోవాలి. ఈ పాలను మీగడ పేరుకునే వరకూ కలుపుతూ మరిగించాలి. మరిగాక పచ్చి కోవా వేసి బాగా కలపాలి. అది కరిగాక పాల మీగడ కూడా చేర్చి మరోసారి తిప్పాలి. ఆపై పంచదార వేసి కరగనివ్వాలి. చివర్లో యాలకులు పొడి చల్లి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బాదం, పిస్తా తురుము పైన వేసి కుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకోవాలి. వాటిని అయిదారు గంటలపాటు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. అంతే... చల్లని తీయతీయగా మీకోసం కుల్ఫీ రెడీ.