సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (14:50 IST)

కేసీఆర్ ఓ కసాయిలా ప్రవర్తించారు.. రైతులూ రుణాలు చెల్లించొద్దు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాకూటమి కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఓ కసాయిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అర్థరాత్రి ఇళ్ళలోకి దూరి గొర్రెల్లా లాక్కుపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన బుధవారం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు ముఖ్యమని.. మన బతుకులు కాదన్నారు. మనం చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఓటు వేయాలని చెబుతాడని పేర్కొన్నారు.