శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:48 IST)

ఓటెత్తిన తెలంగాణ.. మధ్యాహ్నం ఒంటి గంటకే 50 శాతం పోలింగ్

తెలంగాణాలో ఓటర్లు క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఫలితంగా మధ్యాహ్నం ఒంటి గంటకే 50 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. సాయంత్రానికి భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
నిజానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గంటగంటకూ పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. ఫలితంగానే మధ్యాహ్నం ఒంటిగంటకే 50 శాతం మేరకు పోలింగ్ నమోదైంది. ఇదేవిధంగా సాయంత్రం వరకు కొనసాగినట్టయితే పోలింగ్ శాతం 80 శాతం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
ఇదిలావుంటే అనేక ప్రాంతాల్లో అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇలాంటివారిలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్, ఫిల్మ్ నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వెయ్యికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. పోలింగ్ ప్రారంభమైన వెంటనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తీరా ఓటరుజాబితాలో తమ పేరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇలా దాదాపు వెయ్యి మంది ఓటర్లు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ తమ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చేసేదేం లేక వెళ్లిపోయారు.