1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (10:35 IST)

తెలంగాణ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం(Video)

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లతో పాటు.. సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అటు రాజకీయ నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. 
 
హైదరాబాద్, జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పోలింగ్ బూత్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్ సాధారణ ఓటరులా వరుసలో నిల్చొని, తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. అనంతరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
అలాగే, సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలింనగర్ క్లబ్‌లో ఉదయం 7 గంటలకే ఓటు వేశారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, అమల దంపతులు జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారు కూడా సాధారణ ఓటర్లులాగే వరుసలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ పోలింగ్ సెంటర్‌లో సినీ హీరో వెంకటేష్‌ ఓటు వేశారు. కాగా అక్కడి ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటు వేసేందుకు వచ్చిన సినీ హీరో వెంకటేష్‌తో.. రిటర్నింగ్ అధికారితో పాటు సిబ్బంది ఫొటోలు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి ఫోన్లను అనుమతించేది లేదని ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రూల్స్‌కు విరుద్దంగా ఎన్నికల సిబ్బంది ఫోన్లను తీసుకెళ్లడమేకాకుండా సెల్ఫీలు దిగడం ఇపుడు వివాదాస్పదమైంది. చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటు వేశారు... చూడండి వీడియోలో..