సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (17:45 IST)

"స్వామి"ని ఆదర్శంగా తీసుకుందాం... మనమే సీఎం అవుదాం

ఎంఐఎం నేత, ఆ పార్టీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచారంలోభాగంగా, అక్బురద్దీన్ మాట్లాడుతూ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుదామని ప్రకటించారు. 
 
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆయన మాట్లాడుతూ, '‘డిసెంబరు 11వ తేదీన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పుతాం. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్‌ చేస్తం. అంతా సవ్యంగా జరిగితే మనమే ముఖ్యమంత్రి అవుదాం.. మనమే ఉద్యోగాలు ఇద్దాం' అని ప్రకటించారు. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా జరిగిన బహిరంగసభలో ఈయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 38 స్థానాలు గెలిచిన జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయినప్పుడు 8 స్థానాలు గెలుచుకుంటే తానెందుకు ముఖ్యమంత్రి కాలేనని అక్బర్‌ అంటున్నారు. 
 
అక్బర్‌ ప్రకటనలు మజ్లిస్‌ మిత్రపక్షమైన తెరాసకు మింగుడు పడటంలేదు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ మొదలవగానే హంగ్‌ ఏర్పడుతోందని గ్రహించిన కాంగ్రెస్‌ మెరుపువేగంతో స్పందించింది. బీజేపీని అధికారంలో రానీయకుండా చూసేందుకు జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అలాగే, మహాకూటమి సాధారణ మెజారిటీకి ఆరేడు సీట్ల దూరంలో ఆగిపోతే తెలంగాణలోనూ కర్నాటకం రిపీట్‌ అవుతుందని అక్బర్‌ ఆశిస్తున్నారు.