మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (14:19 IST)

హైదరాబాద్‌లో మద్యానికి టోకన్... రూ.10 నోటిస్తే ఫుల్‌బాటిల్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లుచేశారు. అలాగే, ఎన్నికల ప్రచారం కూడా బుధవారంతో ముగిసింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, సరికొత్త టెక్నిక్స్‌తో ముందుకుసాగుతున్నారు.
 
ముఖ్యంగా, మద్యం బాబులను తమవైపునకు ఆకర్షించేందుకు కరెన్సీ నోట్లను పంపిణీ చేస్తున్నారు. రూ.10 నోటిస్తే రూ.460 విలువ చేసే ఫుల్ బాటిల్, రూ.50 నోటిస్తే రూ.600 విలువ చేసే మద్యం సీసా, రూ.100 నోటిస్తే రూ.1000 విలువ చేసే మద్యంబాటిల్‌ను ఇస్తున్నారు. 
 
అయితే, మందుబాబు ఇచ్చే నోటు మద్యం దుకాణంలో ఉన్న జాబితాలో సిరీస్ నంబరుతో సరిపోలితేనే మద్యంబాటిల్ చేతికి ఇస్తారు. లేకుంటే సొంత డబ్బులతో మద్యంబాటిల్ కొనుగోలు చేయాల్సివుంటుంది. గి ముచ్చట.. ఆనోటా.. ఈనోటా పడి అదికాస్త మాదాపూర్ పోలీసులకు చేరింది. దీంతో మద్యంషాపు మేనేజరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.