శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:53 IST)

పరకాలలో కొండా సురేఖకు షాక్.. సిద్ధిపేటలో హరీష్ రావు కారు జోరు..

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో భాగంగా పరకాలలో మహాకూటమికి షాక్ తప్పలేదు. పరకాలలో కొండా సురేఖ ఘోరంగా ఓడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాజయం పాలైంది. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో కొండా సురేఖ ఘోర పరాజయం పాలయ్యారు. 
 
కొండా కుటుంబంపై ప్రజలు నమ్మకం వుంచలేదని.. కొండా సురేఖను పరకాల ప్రజలు నమ్మలేదని.. తప్పుడు హామీలకు గట్టిగా బుద్ధి చెప్పారని ఆ నియోజకవర్గంలో గెలుపును నమోదు చేసుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు తమకు మరో అవకాశం ఇచ్చారనీ, దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
 
ఇదిలా ఉంటే సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలున్నాయి. ప్రజా కూటమి అభ్యర్థి భవాని రెడ్డిపై 80,803 ఓట్ల ఆధిక్యంతో హరీశ్ దూసుకెళ్తున్నారు. కాగా ఇప్పటి వరకూ 13 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా రెండు రౌండ్లు మిగిలున్న నేపథ్యంలో భారీ ఓట్ల ఆధిక్యంతో హరీష్ రావు గెలుపొందే అవకాశం వుంది.