శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2024 (22:51 IST)

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Allu Arjun
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు నుంచి కాపీలు చంచల్ గూడ జైలుకు ఇంతవరకూ రాలేదు. దీనితో అల్లు అర్జున్ విడుదల శుక్రవారం లేనట్లేనని అంటున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీలు ఆన్లైన్‌లో అప్లోడ్ అవడంలో జాప్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్ట్ ఆర్డర్ కాపీ కోసం చంచల్ గూడా జైలు వద్ద అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ విడుదల అయ్యే ఛాన్స్ లేకపోవడంతో చంచల్ జైలు వద్దకు బన్ని ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు.
 
అల్లు అర్జున్ కోసం చంచల్ గూడ జైలులో క్లాస్-1 బ్యారక్‌ను జైలు అధికారులు సిద్ధం చేసారు. మరోవైపు సమయం కూడా రాత్రి 10 గంటలు దాటడంతో ఇక అల్లు అర్జున్‌ను జైలు నుంచి విడుదల చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనితో తీవ్ర అసహనంతో అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్యాబ్ మాట్లాడుకుని అక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.