Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయత్‌నగర్‌: పార్కింగ్ చేసిన కారులో మంటలు.. ఎలా జరిగింది?

Written By సెల్వి
Updated: సోమవారం, 10 ఆగస్టు 2026 (15:48 IST)
Car Catches Fire in Hayathnagar
హైదరాబాద్‌, హయత్‌నగర్‌లోని శంకర్ నగర్ కాలనీలో సోమవారం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సమయంలో పెద్ద శబ్దం రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. 
 
చాలా కాలంగా వాడకపోవడంతో ఆ కారును పక్కన పెట్టి ఉంచినట్లు యజమాని తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు అంటుకున్నప్పుడు బాంబు పేలుడు తరహాలో పెద్ద శబ్దం వచ్చిందని, అసలు ఏం జరుగుతుందో తెలియక తాము భయపడ్డామని స్థానికులు చెప్పారు. 
 
ఈ ఘటనలో శంకర్‌నగర్‌ మాధవ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ కారు పూర్తిగా మంటలకు ఆహుతి అయ్యింది. కారును ఎవరో ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారని కారు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు దగ్ధమైన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Raviteja: ఇరుముడి విజయంతో సంతోషంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో రవితేజ

బంద‌ర్‌ స్ట్రీమింగ్‌.. వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించిన బాబీ డియోల్‌

Nagababu: చిరంజీవి పుట్టినరోజు నాడు మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగేంద్రబాబు

కాంతార, కార్తికేయ వరుసలో మహేంద్రగిరి వారాహి చేరుతుంది : సుమంత్

Vishwambhara : విశ్వంభర ప్రత్యేక పోస్టర్, OST విడుదలచేసిన యువి క్రియేషన్స్

తర్వాతి కథనం
Show comments