సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (17:13 IST)

హైదరాబాద్ రోడ్ పాత్‌వేలపై కొబ్బరిబొండం షాపులు, ఖాళీ చేస్తుంటే బొండాలతో కొట్టారు(video)

Hyderabad pathways
నగరాల్లో రోడ్లకిరువైపులా ఏమాత్రం ఖాళీ వున్నా చిన్నచిన్న బండ్లపైన సరుకులు అమ్మేస్తుంటారు చిరు వ్యాపారులు. వారికి ఇదే జీవనోపాధి కానీ కొన్నిసార్లు ఇలాంటివే రోడ్లపై వెళ్లేవారి ప్రాణాల మీదుకు తెస్తుంటాయి. ఈ నేపధ్యంలో GHMC పాత్ వేలపై వున్న కొబ్బరిబొండాల షాపును తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినా సదరు వ్యాపారులు ఎంతకీ వినలేదు.
 
దీనితో జిహెచ్ఎంసి కార్మికులు వాహనాన్ని తీసుకుని వచ్చి కొబ్బరిబొండాలను అందులోకి ఎక్కించే పని మొదలుపెట్టారు. అదిచూసిన వ్యాపారులు వెంటనే కార్మికులపై రాళ్లు, కొబ్బరిబొండాలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో సిబ్బందిలోని కొందరికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో సిబ్బంది ప్రాణాలు దక్కాయి అనుకోవచ్చు.