1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (20:12 IST)

లాస్య నందిత అంతిమ యాత్ర-పాడె మోసిన హరీశ్ రావు

Harish Rao
Harish Rao
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్ర కార్ఖానాలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
తూర్పు మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాస్య నందిత అంతిమ యాత్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి బరువెక్కిన హృదయాలతో పాల్గొన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.