బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (19:32 IST)

మహారాష్ట్రలో దుకాణం మూసేసిన బీఆర్ఎస్.. ఏపీ బాటలో షట్టర్ క్లోజ్?

brslogo
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయంగా చక్రం తిప్పాలనుకున్నారు. కానీ అది కలగానే మిగిలింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ రాజకీయాల ఎత్తుగడలో భాగంగా తొలి దశలో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ ఓటమిని చవిచూసింది. దీంతో బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా ఎదగాలనుకున్న ఆ పార్టీకి కష్టాలే మిగిలాయి. 
 
ఈ క్రమంలో ఇంకా బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిష్క్రమణతో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ తన షట్టర్లను మూసివేసింది. ఇదే తరహాలో బీఆర్ఎస్ మహారాష్ట్రలో దుకాణం మూసేసింది. ఫలితంగా ఏపీ, మహారాష్ట్రాలో బీఆర్ఎస్ ఆఫీస్ క్లోజ్ అయ్యింది. 
 
తెలంగాణలో ఎన్నికల పోరులో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ తన ప్రతాపాన్ని కోల్పోయింది. జాతీయ రాజకీయ ఆకాంక్ష కుప్పకూలింది. స్థానిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఆశ్చర్యకరంగా కొన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో మహారాష్ట్రలోని బిఆర్‌ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో ఓటమిని అంచనా వేసిన నేతలు కాంగ్రెస్, బిజెపి, శివసేనలోకి వెళ్లారు.