ప్రియురాలిని పిచ్చకొట్టుడు కొడుతున్న భార్యను చూసి భర్త గోడ దూకి పరార్ (video)
భర్త మరో మహిళతో సాగిస్తున్న ప్రేమయణాన్ని కనిపెట్టిన భార్య నేరుగా వెళ్లి భర్తను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త ప్రియురాలిని చెంపలు వాయిస్తుండగా భర్త కాస్తా పిల్లిలా అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
రంగారెడ్డి జిల్లా లక్ష్మారెడ్డి పాలెంలో ప్రశాంత్, శ్వేత నివాసం వుంటున్నారు. ఐతే గత ఏడాదిగా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ ఇంటికి రావడంలేదు. అదేమని అడిగితే డబ్బు లేదు కదా నువ్వేమైనా అంటావని రావడంలేదంటూ ఏదో చెబుతున్నాడు. దీనితో భార్య శ్వేత తన తండ్రి మరణించగా వచ్చిన రూ. 30 లక్షల పరిహారం ఇచ్చి వ్యాపారం చేయమని చెప్పింది. ఐతే డబ్బు తీసుకున్న ప్రశాంత్ వ్యాపారం పెట్టకపోగా వారంలో నాలుగైదు రోజులు ఇంటికి రాకుండా వుంటున్నాడు. దీనితో అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన శ్వేత అతడిని వెంబడించింది.
భర్త నేరుగా వాణి అనే టీచర్ ఇంటి లోపలికి వెళ్లి అక్కడే రాత్రంతా గడపేశాడు. ఇది గమనించిన శ్వేత తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తెల్లారేసరికి వాణి తలుపులు కొట్టింది. తలుపు తీయగానే శ్వేత నేరుగా వాణి చెంపలు వాయించింది. ఇది గమనించిన శ్వేత భర్త అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఈ వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా తన భర్త తన డబ్బు రూ. 30 లక్షలు తీసుకుని అతడి ప్రియురాలికి కారు, స్కూటీ, బంగారం కొని ఇచ్చాడంటూ శ్వేత ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.