గురువారం, 6 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మార్చి 2025 (11:39 IST)

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

Accident
Accident
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లాలో సిమెంట్ లారీని ట్రావెల్స్ బ‌స్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలైనాయి. 
 
ఏలూరు సమీపంలో సోమవరప్పాడు - చొదిమెళ్ళ వద్ద ఆగివున్న లారీని వెంకట రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఇంకా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 
 
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు నంబర్ NL 01 B 3092గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.