సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (17:06 IST)

హెపటైటిస్-ఎ వైరస్‌కు వ్యాక్సిన్‌.. హైదరాబాద్ కంపెనీ ప్రకటన

vaccine
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ కంపెనీ హెపటైటిస్ ఎ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను ఇటీవల విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌కు చెందిన ఐఐఎల్, హ్యావ్‌సూర్ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ టీకా హెపటైటిస్ Aకి వ్యతిరేకంగా పని చేస్తుంది. ఈ టీకా ప్రజారోగ్యానికి గణనీయమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. 
 
శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. ప్రజారోగ్యంలో ఇదొక చారిత్రక ఘట్టంగా ఆ సంస్థ అభివర్ణించింది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశం హెపటైటిస్ ఎ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది.
 
జాతీయ వైద్య రంగంలో హ్యావిజర్ ఆవిష్కరణ ఒక మైలురాయి. 8 కేంద్రాలలో విస్తృతమైన క్లినికల్ ట్రయల్స్ తర్వాత, మేము ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చాం. ఇది సురక్షితం. ఇది హెపటైటిస్ Aకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా నిరూపించబడింది.. అంటూ వివరించారు.