Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

Written By ఠాగూర్
Updated: సోమవారం, 16 జూన్ 2025 (13:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ యేడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 
 
మరోవైపు, ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ అనుమతించడం లేదు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచందర్ రావు వచ్చారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు దర్యాప్తు అధికారిగా మాజీద్ ఖాన్ ఉన్నారు. 
 
ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ విమాన ప్రమాదంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. అయితే, శని, ఆదివారాల్లో అదే సంస్థకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సమస్యలు తలెత్తి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఈ రెండూ కోల్‌కతా వెళ్లాల్సిన విమానాలే కావడం గమనార్హం. 
 
గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఐఎక్స్ 1226 విమానం శనివారం రాత్రి 9.20 గంటలకు బయలుదేరాలి. సాంకేతిక సమస్య పేరుతో అది ఆలస్యమైంది. ఈ విమానంలో సమస్య ఏమిటో, విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దానిపై పలు వీడియోలు క్షణాల్లో చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో వారిని విమానం దిగాలని చెప్పి ఒక హోటల్‌కు తరలించారు. 
 
ఆదివారం ఉదయం 9.30కి మళ్లీ విమానం ఎక్కించారు. అదే సాంకేతిక సమస్య వల్ల విమానం ఆలస్యమవుతోందని మరోసారి ప్రకటించారు. రెండోసారి కిందికి దించి, విమానాశ్రయంలోకి తరలించారు. వేరే విమానం ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. చివరకు అలా మరో విమానంలో సాయంత్రం 3.34 గంటలకు వారు బయల్దేరారు. కొందరు మాత్రం వేరే విమానాలను ఎంచుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి బయల్దేరి 9.20కి కోల్‌కతాకు చేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐఎక్స్ 1511)లోనూ సాంకేతిక లోపం తలెత్తింది.
 
టేకాఫ్‌కు ముందు దీనిని గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. దీంతో అది రన్ వేపైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది. ప్రయాణం 7 గంటలు ఆలస్యమవుతుందని, ప్రయాణికులకు కావాలంటే టికెట్ సొమ్ము వాపసు చేస్తామని సంస్థ వెల్లడించి తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. లోపాన్ని సరిచేశాక మధ్యాహ్నం 2.09 గంటలకు ఇది బయల్దేరి సాయంత్రం 4.24 గంటలకు గమ్యాన్ని చేరుకుంది. 

అన్నీ చూడండి

Ravi Teja: ఇరుముడి రెస్పాన్స్ చూస్తుంటే కళ్లు చెమర్చాయి.: మహారాజా రవితేజ

Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి

ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమాను ప్రకటించిన కిరణ్ అబ్బవరం

Tamannaah : తమన్నా భాటియా... ది వ్వాన్ ఎపిక్ ఫాంటసీ విడుదలకు సిద్ధం

Soundarya Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయనున్న సౌందర్య

తర్వాతి కథనం
Show comments