మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మార్చి 2025 (15:09 IST)

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

Konda surekha
Konda surekha
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యాపీ అనే శునకం గుండెపోటుతో ఆమె నివాసంలో మరణించింది. తన ఇంట్లో ఒక వ్యక్తిగా మారిన ఆ పెంపుడు కుక్క నిర్జీవ శరీరాన్ని చూసి కొండా సురేఖ కన్నీటిపర్యంతం అయ్యారు. 
 
ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకుంటున్న ఆ మూగజీవి చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భావోద్వేగానికి లోనై, ఆమె ఓదార్చలేనంతగా కన్నీరు పెట్టుకున్నారు కొండా సురేఖ. కుక్క మృతదేహంపై పువ్వులు చల్లి నివాళి అర్పించారు. 
Dog
Dog
 
అనంతరం దానికి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ శునకం మరణించడంతో కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శునకానికి అంత్యక్రియలు నిర్వహించడం చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.