రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 22 ఆగస్టు 2025 (14:41 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల నంబర్లలో మార్పులు చేసింది. కొన్ని ముఖ్యమైన మార్గాల్లో నడిచే రైళ్ల నంబర్ల మార్చడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పాత్ కోచ్‌ల స్థానంలో ఆధునిక మెమూ కోచ్‌లను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులు ఈ కొత్త మార్పులను గమనించాలని రైల్వేశాఖ సూచన చేసింది. 
 
కాచిగూడ - వాడి మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైలు (57601/57602) నంబర్లను 67785/67786గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త నంబర్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదేవిధంగా కాచిగూడ - రాయచూర్ ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైలు నంబరును 67787/67788గా మార్చినట్టు తెలిపింది. 
 
ఈ నంబర్ల మార్పుతోపాటు కోచ్‌లలో కూడా కీలక మార్పులు చేస్తున్నారు. కాచిగూడ - వాడి ప్రాంతాల మధ్య నడిచే రైలులో ఉన్న ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఆధునిక మెమూ రేక్‌ను, అలాగే, కాచిగూడ - రాయచూర్ మార్గంలో డెమో స్థానంలో కూడా మెమూ రేక్‌ను వినియోగించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
మరోవైపు, మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు (77648) రాక సమయాన్ని కూడా స్వల్పంగా మార్చారు. గతంలో ఉదయం 10 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకునే ఈ రైలు ఇకపై 10.20 గంటలకు చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, కొత్త నంబర్లు, సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

అన్నీ చూడండి

బిగ్ బాస్ 20వ సీజన్ లోగో ఆవిష్కరణ: సల్మాన్ హోస్ట్‌గా కీలక మార్పులు

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments