ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (22:20 IST)

మనవడితో హోలీ జరుపుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తమ ఇంట్లో రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత మనవడితో కలసి రంగుల పండుగ ఆడుకుంటూ కనిపించారు. సీఎం దంపతులు మనవడితో సరదాగా గడిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి హోలీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రేమ, ఆప్యాయత, సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంగుల పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాంప్రదాయ పద్ధతుల్లో సహజ రంగులను ఉపయోగించి హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వంలో 'ప్రజాపాలన'లో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని రేవంత్‌రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. 
 
కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ఐక్యతను నిలబెట్టే హోలీ పండుగ యావత్ దేశంలో మార్పు తెస్తుందని, త్వరలోనే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని అన్నారు.