శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (18:32 IST)

జగన్ అక్రమాస్తుల కేసు : తెలంగాణ హైకోర్టు నోటీసు ... చిక్కులు తప్పవా?

ys jaganmohan reddy
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై జనసేన పార్టీ సీనియర్ హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన కోర్టు.. జగన్‌తో పాటు సీబీఐ‍కు నోటీసులు జారీచేసింది. అయితే, ప్రతివాదులకు మాత్రం ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తుంది. 
 
ప్రజా ప్రతినిధులపై ఉన్న వివిధ రకాల కేసులను త్వరగా విచారించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటోగా పిల్ రూపంలో విచారిస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌‍ను జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేసింది. 
 
జగన్‌పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామజోగయ్య తన పిటిషన్‌లే కోరారు. ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ, డిశ్చార్జ్ పిటిషన్‌ పెండింగ్‌పై సీబీఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెంలగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు ఆలకించిన పిమ్మట ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణనను మూడు నెలలకు వాయిదావేసింది.